Sunday, October 14, 2012


                                          తెలుగు భాష


  • 'నాగరిక జాతి' మాతృభాషలోనే మాట్లాడుతుంది' అని ప్రముఖ ఆంగ్ల కవి  డబ్ల్యూ.బి.ఈట్స్ వాఖ్యానించాడు. దీన్నిబట్టి  మనం మనది అంటే 'తెలుగు వారిది' నాగరిక జాతి  అవునో, కాదో నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమయింది.

  • 'డాలరు గడ్డకైనా, ఇంకేదేశానికయినా  వెళ్ళడానికి కావలసిన ఆంగ్లమెంత' ? దానికోసం 'మాతృభాషను' నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. కాని అదే జరుగుతోంది. దీన్ని నియంత్రించుకోవాలి. 

  • 'తెలుగుభాష' అంతరిస్తుందన్న భయం అవసరం లేదు. ఒక జాతి సజీవంగా, చైతన్యవంతంగా ఉన్నంతకాలం, కొన్ని ప్రలోభాలకు లోబడినంత మాత్రాన 'భాష' అంతరించదు. కాని ఆజాతి కళ్ళు తెరవాల్సిన సమయం, తమను తాము, తమ భాషకు పునర్వైభవం తీసుకురావా ల్సిన ఆసన్నమయింది.. అందుకు యువత నడుంకట్టాలి.తెలుగు మాట్లాడుతూ పుంఖాను పుంఖాల ఆంగ్ల పదాలు వాడే దుస్సంస్కృతిని విడనాడాలి.  

  • అన్యభాషాపదాల్ని కలుపుకునే 'భాషే' సుసంపన్నంగా ఉంటుంది. కాలానుగుణంగా అన్య భాషా పదాలనూ స్వీకరించాలి. ఇముడ్చుకోవాలి. 

  • రాసినట్లే ఉచ్ఛరించడం, ఉచ్ఛరించినట్లే  రాయడం (వ్రాయగలగడం) 'తెలుగు భాష' కు ఉన్న ప్రధాన లక్షణం.    ఏ భాషకు ఈ సౌలభ్యం లేదు.

సూచన :  పైన వ్రాసిన ఈ పరిశీలనా వాఖ్యలు 'తెలుగువెలుగు' మాస పత్రికలో  పద్మభూషణ్ డాక్టర్. సి. నారాయణరెడ్డిగారి 'తెలుగదేలయన్న' వ్యాసము లోనివి. తెలుగువారిలో 'జాగృతి' రావాలి. 'తెలుగు' భాషకు పునర్వైభవం రావాలి.