Saturday, May 7, 2016

ఆత్మవిశ్వాసం

అన్నీ బాగున్నప్పుడు మనుషుల్లో ఆత్మవిశ్వాసం మెండు. అదే పరిస్థితులు అనుకూలించక  ప్రతికూలంగా ఉన్నప్పుడు మనుషుల్లో అదే ధీమా ఉండడం బహు అరుదు.      

Friday, October 9, 2015


         'If Becoming Religious has made you more Judgmental, Rude, Harsh, A back biter, you need to check if you are worshiping GOD or EGO'
     
         ' మత,ధార్మిక వాదిగా  నువ్వు  ఒక సమతుల్య భావవ్యక్తీకరించే వ్యక్తిగానో లేక  మోటుగానో  లేక  కరుకుగానో, పరుషంగానో లేక మనుషుల వెనకాల ద్వేషంతో మాట్లాడే వ్యక్తిగానో  మారావంటే  నువ్వు అసలు భగవంతుణ్ణి  ధ్యానిస్తున్నావా 
లేక నీ 'అహాన్ని' ప్రేమిస్తున్నావా? అన్నవిషయాన్ని నువ్వు కచ్చితంగా తేల్చుకొనవలసిన  సమయం ఆసన్నమయిందని తెలుసుకో !    


                      

Thursday, August 20, 2015

“Be there for others, but never leave yourself behind.”
“No one can make you feel inferior without your consent.”

Saturday, April 6, 2013

అనుమానం పెనుభూతం

                                      
                                                             అనుమానం పెనుభూతం

              అనుమానం పెనుభూతం. అది మనిషిని ఎంతటి నీచత్వానికైనా దిగజారుస్తుంది పెద్దలెన్నడో చెప్పారు.
మదిలో ఒకసారి అనుమాన బీజం పడితే చాలు  అది మనిషిని దిద్దుకోలేని తప్పులు చేయిస్తుంది. మనసును నిలువెల్లా కలుషితం చేసి హేతుబద్ధమైన ఆలోచనాశక్తిని నాశనం చేస్తుంది.
అంతటితో ఆగదు. బుద్ధిని వక్రమార్గం పట్టిస్తుంది. నిజం చెప్పాలంటే నీచత్వానికి దిగజారుస్తుంది.
అంతే కాదు. మనిషిని క్రూరులుగా మారుస్తుంది.          

            

 

Saturday, November 3, 2012

 There comes a time in life when you walk away from all the drama and the people who create it. Surround yourself with people who make youn laugh, forget the bad and focus on the good. Love the people who treat you right and pray for the ones who don't. Life is too short to be anything but happy.
falling down is part of life and getting back up is living.........!

Sunday, October 14, 2012


                                          తెలుగు భాష


  • 'నాగరిక జాతి' మాతృభాషలోనే మాట్లాడుతుంది' అని ప్రముఖ ఆంగ్ల కవి  డబ్ల్యూ.బి.ఈట్స్ వాఖ్యానించాడు. దీన్నిబట్టి  మనం మనది అంటే 'తెలుగు వారిది' నాగరిక జాతి  అవునో, కాదో నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమయింది.

  • 'డాలరు గడ్డకైనా, ఇంకేదేశానికయినా  వెళ్ళడానికి కావలసిన ఆంగ్లమెంత' ? దానికోసం 'మాతృభాషను' నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. కాని అదే జరుగుతోంది. దీన్ని నియంత్రించుకోవాలి. 

  • 'తెలుగుభాష' అంతరిస్తుందన్న భయం అవసరం లేదు. ఒక జాతి సజీవంగా, చైతన్యవంతంగా ఉన్నంతకాలం, కొన్ని ప్రలోభాలకు లోబడినంత మాత్రాన 'భాష' అంతరించదు. కాని ఆజాతి కళ్ళు తెరవాల్సిన సమయం, తమను తాము, తమ భాషకు పునర్వైభవం తీసుకురావా ల్సిన ఆసన్నమయింది.. అందుకు యువత నడుంకట్టాలి.తెలుగు మాట్లాడుతూ పుంఖాను పుంఖాల ఆంగ్ల పదాలు వాడే దుస్సంస్కృతిని విడనాడాలి.  

  • అన్యభాషాపదాల్ని కలుపుకునే 'భాషే' సుసంపన్నంగా ఉంటుంది. కాలానుగుణంగా అన్య భాషా పదాలనూ స్వీకరించాలి. ఇముడ్చుకోవాలి. 

  • రాసినట్లే ఉచ్ఛరించడం, ఉచ్ఛరించినట్లే  రాయడం (వ్రాయగలగడం) 'తెలుగు భాష' కు ఉన్న ప్రధాన లక్షణం.    ఏ భాషకు ఈ సౌలభ్యం లేదు.

సూచన :  పైన వ్రాసిన ఈ పరిశీలనా వాఖ్యలు 'తెలుగువెలుగు' మాస పత్రికలో  పద్మభూషణ్ డాక్టర్. సి. నారాయణరెడ్డిగారి 'తెలుగదేలయన్న' వ్యాసము లోనివి. తెలుగువారిలో 'జాగృతి' రావాలి. 'తెలుగు' భాషకు పునర్వైభవం రావాలి.