మనిషికి బాధ, కోపం వంటి భావనలు ఎందుకు కలుగుతాయి..........
జీవికి ఆహరం గాలి, నీరు ప్రధాన అవసరాలు. పరిణితి చెందిన మానవులు,ఇతర కొన్ని జీవులు సమూహాలుగా
నివసిస్తాయి.మానవ సమూహాన్ని సమాజం అంటాము ! మానవుడికి ప్రకృతి సహజమైన ప్రాధమిక అవసరాలతో పాటు స్నేహం, బృందభావన,పరిశీలన,పరిశోధన,ఆలోచన వంటి భావ పరమైన అంశాలు కూడా వున్నాయి.సంఘజీవిగా మనిషి ఎదిగే క్రమంలో తనకు ఇష్టమైన, ఇష్టం లేని సంఘటనలను గుర్తించాడు. వాటికి అనుగుణం గానే శరీరం లో మార్పులు కలగడం గమనించాడు. శరీరం లో ఆవాంఛనీయ నాడీ ప్రకంపనలను కలిగించేది దుఖంగాను, బలోపేతం చేసే భావనలను సంతోషంగాను వైద్య శాస్త్రం చెబుతోంది. భావాలు కలగడానికి కారణం మెదడులో ఉత్పన్నమయ్యే కొన్ని రకాల రసాయనాలేనని శాస్త్రవేత్తలు గుర్తించారు.వాటికి అనుగుణం గానే నవ్వు, ఏడుపు,చెమటలు పట్టడం,శరీరం వణకడం , గొంతు గాద్గికం కావడం లాంటి బాహ్య ప్రకటనలు కలుగుతాయి.ఒంటరిగా అడవిలో పెరిగే వ్యక్తికి కోపం, నవ్వు వంటి భావాలు కలగవని రుజువయింది.సామాజిక జీవనమే భావ ప్రకటనలను శరీరానికి అలవాటు చేస్తుంది.
No comments:
Post a Comment